యద్భావం తద్భవతి..!
జూలై 6:మంచి చెడుల కలయికతోనే ఈ సృష్టి అంతా ఉంది. మహాభారతంలో ధర్మరాజైతే ఈ లోకమంతా ధర్మంగా నడుస్తున్నట్టుగా చూస్తూ వచ్చాడు. దుర్యోధనుడి దృష్టిలో అంతా అధర్మంగానే ఉండేది. తప్పు చేసినవాళ్లకి కఠినమైన శిక్షలు వేస్తే తప్ప ధర్మం జరగదు అనిపించేది అతనికి. ఇద్దరు చూసిందీ ఒక లోకాన్నే. మనం ఎలా చూస్తామో అది అలానే కనిపిస్తుంది అనే దానికి ఇది ఉదాహరణ.
సంస్కృతంలో ఒక వాక్యం ఉంది. అదే యద్భావం తద్భవతి అనేది. మనం ఎలా చూస్తే అలాగే ఉంటుందనేది దీని అర్థం. అది వెంటనే ఉండకపోవచ్చు. కాని చూసి జ్ఞాపకం పెట్టుకున్న వాసన పక్వమై మళ్లీ దర్శనం అయ్యేటప్పుడు ‘యత్ వాసనా తత్ దర్శనం’ అవుతుంది. అంటే వాసన ప్రకారమే దర్శనం అవుతుంది. వాసన మనం నిర్ణయించిన మన భావాన్ని బట్టి ఉంటుంది.
ఈ ప్రపంచం పుచ్చిపోయింది, కుళ్ళిపోయింది. పనికిరానిదయింది. దీనిని ఎవరూ రక్షించలేరు. ఏ అవతార పురుషుడో వచ్చి సమూలంగా మార్చాలనే భావంతో మనం ఉంటే అది వాసనై పునర్జన్మలో మళ్ళీ అదే భావంతో పుడతాము. మంచి చెడుల కలయికతోనే ఈ సృష్టి అంతా ఉంది. మహాభారతంలో ధర్మరాజైతే ఈ లోకమంతా ధర్మంగా నడుస్తున్నట్టుగా చూస్తూ వచ్చాడు. దుర్యోధనుడి దృష్టిలో అంతా అధర్మంగానే ఉండేది. తప్పు చేసినవాళ్లకి కఠినమైన శిక్షలు వేస్తే తప్ప ధర్మం జరగదు అనిపించేది అతనికి. ఇద్దరు చూసిందీ ఒక లోకాన్నే. మనం ఎలా చూస్తామో అది అలానే కనిపిస్తుంది అనే దానికి ఇది ఉదాహరణ.
ఒకడు ఆవును చూసాడు. మామూలుగా పశువనే భావంతోనే ఉన్నాడు. పాల వ్యాపారం చేసేవాడు దానిని చూసాడు. ఇది ఎన్ని పాలిస్తుంది? దీనిని అమ్ముతారా? కొంటే మనకెంత లాభం? అని ఆలోచించాడు. కొంచెం దైవభక్తి ఉన్నవాడు చూసాడు. తోకవైపు తిరిగి దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు. మరొకతను ఆ ఆవుని పసుపు కుంకుమలతో అలంకరించి అరటిపండు పెట్టాడు. ఆవు మాంసాన్ని అమ్ముకునే ఒకతను దానిని చూచాడు. ఈ ఆవు బలిష్ఠంగా ఉంది దీని మాంసం అమ్మితే ఎంత లాభం వస్తుంది? అని ఆలోచించాడు. ఒక చర్మకారుడు దానిని చూసి దాని చర్మంతో మంచి చెప్పుల జతలు కుట్టవచ్చనుకున్నాడు. ఇది కూడా యద్భావం తద్భవతి అనే దానికి ఒక ఉదాహరణ.
కొందరికి ఒక స్త్రీని చూస్తే తల్లి అనే భావం కలగవచ్చు. కొందరికి సోదరి అనే భావం కలగవచ్చు. అయితే స్త్రీ అనే జ్ఞానం మాత్రం ఒకటే. మనం ఎలా చూస్తామో అది అలా కనబడుతుంది. ఈ చూడడంలోనే మన వాసన పనిచేస్తుంది. పూర్వ జ్ఞాపకాలు, పూర్వ అనుభవాలు, దాని మీద మన ఇష్టాయిష్టాలు, లాభనష్టాలు, రాగ ద్వేషాలు అన్నీ కూడి చూపు అనే దృశ్యం ఏర్పడుతుంది. మనం మన భావనను బట్టి మంచి చెడు నిర్ణయిస్తుంటాము. ఒక్కో సమయంలో మన నిర్ణయం తప్పు కావచ్చు.
పాండురంగ భక్తుడైన తుకారాం కాలంలో ఒక గ్రామంలోని ధనికులు ఒక వేశ్య పొందుకోరేవారు. తుకారాం ఆమెను తల్లి భావంతో చూసి ఆమెలో పరివర్తన కలిగించాడు. అప్పటి నుంచి ఆమె భక్తి మార్గంలోనికి మళ్ళింది. కనుక ఏ విషయాన్నైనా చూచే సమయంలో జ్ఞానులు గురువుల భావనను అర్థం చేసుకుని అనుసరించేవారు ధన్యులు. జిల్లెళ్లమూడి అమ్మ అనే వారు, ‘అంతటా మంచి చూచేవాడు మంచివాడై ఉంటాడు. అంతటా చెడు చూచేవాడు చెడ్డవాడై ఉంటాడు’ అని. అలాగే అంతటా దైవాన్ని చూచేవాడు దైవమే అవుతాడు అనవచ్చు.
┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈
ఆధ్యాత్మిక అన్వేషకులు
🦚📿🦚 🙏🕉️🙏 🦚📿🦚