ములకలపల్లి మండలంలో ఎంపి రామసహాయం రఘురామ్ రెడ్డి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించారు
జూన్ 30 అశ్వారావుపేట నియోజకవర్గం: ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ ములకలపల్లి మండలంలో పలు గ్రామపంచాయతీలలో పర్యటించారు. సందర్భంగా రెండు కోట్ల అరవైఎనిమిది లక్షలతో పూర్తయిన అభివృద్ధి పనులైన సీసీ రోడ్లు గ్రామపంచాయతీ భవనాలు బీటీ రోడ్లు అంగన్వాడీ భవనాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపలు చేశారు. ములకలపల్లి రైతువేదిక నందు క్రిస్టియన్ మైనారిటీ ద్వారా మంజూరైన కుట్టుమిషన్లు లబ్ధిదారులకు అందించారు అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాదీముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వచ్చిన చెక్కులను బాధితులకు అందించారు.