మహిళా కార్యకర్త మృతి: సమతా ప్రకాష్ మానవత్వాన్ని చాటారు
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళ కార్యకర్త కల్వకోలు మైసమ్మ మృతి చెందిన వార్త తెలిసిన సందర్భంగా,మహిళ అధ్యక్షురాలు కందుల సమతా ప్రకాష్ కుటుంబానికి తన వంతు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో మహేశ్వర్ మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు ఎర్ర నవీన్ కుమార్ మరియు ఇతర పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.