February 22, 2026

మహా శివరాత్రి విశిష్టత.. ఎలాంటి నియమాలు ఆచరించాలి? శివరాత్రి అంటే ఏమిటి అని తెలుసుకుందాం

0
Oplus_131072

Oplus_131072

హైదరాబాద్ ఫిబ్రవరి 15: ఈ సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు (Lord Shiva). భక్తుల పాలిట పెన్నిధి, భోళా శంకరుడైన ఆ త్రినేత్రుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహా శివరాత్రి (Maha Shivaratri)

మహా శివరాత్రి విశిష్టత:
​ఆ పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహా శివరాత్రి
​సముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు సేవించి ‘నీలకంఠుడు’ అయిన రోజు ఇదే.
​శివుడు, పార్వతీదేవిల వివాహం జరిగిన గొప్ప రోజుగా కూడా దీనిని పరిగణిస్తారు.
​ఈ ఏడాది మహా శివరాత్రి (ఫిబ్రవరి 15) ఆదివారం రావడం విశేషం. సూర్యుడికి రుద్రుడు అధిదేవత కావడం వల్ల ఈ రోజు శివారాధన చేస్తే అనారోగ్య సమస్యలు, పాపాలు తొలగుతాయని విశ్వాసం.
​ఆచరించాల్సిన నియమాలు:
ఉపవాసం : ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, మనసును శివనామస్మరణతో భగవంతుడికి దగ్గరగా ఉంచడం.
జాగరణ : ఆఫీసు పనులు చేస్తూనో, సినిమాలు చూస్తూనో మెలకువగా ఉండటం జాగరణ కాదు. రాత్రంతా దైవ చింతనలో గడపడం నిజమైన జాగరణ.
​లింగోద్భవ కాల పూజ: అర్ధరాత్రి 11:30 నుండి 12:30 గంటల మధ్య ఉండే లింగోద్భవ కాలంలో *శివారాధన చేయడం అత్యంత శ్రేష్టం.
​అభిషేకం: పంచామృతాలు, విభూతి, చందనం, జలంతో శివలింగానికి అభిషేకం చేసి, బిల్వ దళాలతో అర్చించాలి.
దక్కు పుణ్యఫలం:
​శివారాధన వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, కీర్తి మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి.
​ఓం నమశ్శివాయ మంత్ర జపం, రుద్రాభిషేకం, బిల్వార్చన చేయడం వల్ల గ్రహ బాధలు తొలగి మోక్షం ప్రాప్తిస్తుంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed