మన ఊరి న్యూస్ పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎస్సి ఎస్టీ కమీషన్ చేర్మెన్ బక్కి వెంకటయ్య
జనవరి 27 అక్బర్ పేట్ భూంపల్లి: మన ఊరి న్యూస్ పత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం దుబ్బాకలో నిర్వహించగా, పలువురు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల స్వరం పాలకుల వరకు చేరాలంటే స్థానిక మీడియా బలంగా ఉండాలని పేర్కొన్నారు. మన ఊరి న్యూస్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమం లో అక్బర్ పేట్ భూంపల్లి మండలసర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు మండల కుమార్ అందె సర్పంచ్ కడారి యాదగిరి అందె ప్రవీణ్ రంగనాబోయిన కుమార్ మన్నే కనకరాజు వార్డ్ మెంబర్ పర్స ప్రవీణ్ సోషల్ మీడియా సయ్యద్ రఫీ రాచకొండ రవీందర్ మన ఊరి న్యూస్ ప్రతి నిది ర్యాకం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.