మన ఊరి న్యూస్ దినపత్రిక ఆవిష్కరణ. సమాజ సంక్షేమం కోసం పత్రికలు పనిచేయాలి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
అక్టోబర్ 19 హైదరాబాద్: పత్రికలు సమాజ సంక్షేమం కోసం పనిచేయాలని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి సూచించారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మసున లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో వెలువడుతున్న మన ఊరి న్యూస్ దినపత్రికను ఆదివారం హైదరాబాద్ బర్కత్ పుర లో కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు విలువైన సమాచారం అందించడంలో పత్రికలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. మన ఊరి న్యూస్ దినపత్రిక మరింత అభివృద్ధి చెంది గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ కావాలని ఆయన కోరారు. సందర్భంగా పత్రిక సంపాదకులు మసున లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… మన ఊరి న్యూస్ పత్రిక లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశ బోయిన శ్రీధర్, దీక్షిత్ రెడ్డి, కార్తికేయ రెడ్డి, జి నరేష్, తదితరులు పాల్గొన్నారు.