బనకచర్ల ప్రాజెక్టు పై సంచలన వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
జూలై 2:”బనకచర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు..చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టులు కరెంటు కట్ చేయండి
తెలంగాణకు నీళ్లు, విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గారు, ఇది తెలంగాణ ప్రజల హక్కులను ఖండించడం అన్నారు.
“చంద్రబాబు నాయుడు కట్టే బనకచర్ల ప్రాజెక్టును ఆపాలంటే, కోవట్లకు నీటి కనెక్షన్లు, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా ఆపండి. అప్పుడు ప్రాజెక్టు ఆటోమేటిక్గా బంద్ అవుతుంది” అని గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు.