పోలీస్ శాఖలో లేడిసింగంల ఏకంగా నాలుగు ఠాణాలకు ఎస్సైలుగా నారీమణులేశాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం.డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతా ఈవ్ టీజింగ్ కు పాల్పడే అకతాయిల తాటతీస్తా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా స్టేషన్ కు రండి: మోపాల్ ఎస్సై సుస్మిత
ఫిబ్రవరి 2 నిజామాబాద్:అధికారులుగా అనామకులకుగా చెలామణి అయ్యే పోలీస్ శాఖలో ఇప్పుడు నారీమణులు శకం మొదలయ్యింది. నిజమే జిల్లా పోలీసు శాఖలో లేడి సింగంలు కార్యక్షేత్రంలోకి దిగారు. శాంతి భద్రతల నిర్వ హణలో తమదైన ముద్ర వేసుకోవడానికి అరుదైన అవకాశం దక్కింది. అవనిలో ఆకాశంలోనే కాదు పోలీసు శాఖలోను సగం కాబోతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా నాలుగు అత్యంత కీలకమైన పోలీస్ స్టేషన్లకు ఎస్సైలుగా నియామకం అయ్యారు. తర్వాత మోపాల్ ఎస్సై సుస్మిత, డ్రగ్స్ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు ఎన్నో చేయటం . ప్రభుత్వం సీఎం కప్ పై యూత్ లో తనదైన ముద్ర వేసుకున్న వైనం. నిత్యం పేదవారి కోసం సహాయం చేయాలని మంచి గుణంతో ఆమె రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజల్లో మమకమవుతూ వారి బాధలు తెలుసుకుంటూ నిత్యం గ్రామాల్లో పర్యటన చేస్తూ నిరస్తుల గుండెల్లో తడదడ పుట్టిస్తున్న ఎస్సై సుష్మిత, యువత గంజాయి డ్రగ్స్ తీసుకోవద్దని గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో గ్రామంలో పెద్దలంతా విద్యార్థులకు యూత్ పై తీసుకున్నటువంటి నిర్ణయాలు సంచలనంగా మారినాయని ఆమెని పలువురు అభినందించారు.
మైనర్ వాహనాలు ఇవ్వకూడదని ఎస్సై సుస్మిత పలు గ్రామాల్లో అవగాహన నిర్వహిస్తూ సైబర్ నేరాగాలపై అప్రమత్తంగా ఉండాలని మహిళలను వెళ్లి వారితో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
నలుగురు మహిళా ఎస్సైలకు మొదటి పోస్టింగ్ లోనే శాంతి భద్రత నిర్వహణలో క్లిష్టంగా ఉండే స్టేషన్లను అప్పగిం చారు. అదికూడా సీనియర్ ఎస్సైలను తప్పించి మరీ! పోలీస్ శాఖలో మహిళా అధికారులుంటారు.
జీతాలు… పదోన్నతులు, మగ అధికారులతో సమానం గానే ఉంటాయి. కానీ పోస్టింగ్లో కనీస ప్రాధాన్యత ఉండదు. చాలా కాలంగా ఈవివక్ష కొనసాగుతుంది. అనేక సవాళ్లు ప్రతికూల పరిస్థితు లుండే శాంతి భద్రతల నిర్వహణలో మహిళా అధికారులను ముందుం చడానికి ఉన్నతాధికారులు వెనుకాడుతారు. కానీ జిల్లాకు కొత్తగా వచ్చి కొత్వాల్.. పోలీస్ శాఖకు నారీ శక్తిని జోడించి వినూత్న ప్రయోగం చేశారు. ఇటీ ఇటీవలే శిక్షణ పూర్తి చేసిన మహిళా ఎస్సైలకు కీలకమైన పోస్టింగ్లు ఇచ్చారు. ఏకంగా నాలుగు కీలకమైన ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియామకం చేశారు. సీనియర్ ఎస్సైలు ఎంతో మంది అందుబాటులో ఉన్న సరే చట్టాల మీద ఇప్పుడే అవగాహన తెచ్చుకున్న యువ ఎస్పైలను బాధ్యతలు ఇవ్వడం. గతంలోనూ జిల్లాకు అనేక మంది లేడీ ఎస్సైలు
వచ్చినా ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చేది. మహిళా స్టేషన్ సఖీ కేంద్రాలకే పరిమితం అయ్యేది. ఈసారి ఏకంగా నాలుగు స్టేషన్లకు ఎస్సైలుగా నియామకం చేశారు. అదికూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న సెగ్మెంట్లలో! శిక్షణ పూర్తి చేసిన అ ధికారులకు నేరుగా స్టేష న్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కొత్త అధికారులకు అనుభ వం రావడానికి ఇది అనివార్యంగా భావించే వా రు.. రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి సీనియర్లు తప్పించి పోస్టింగ్ లు ఇవ్వడం పోలీస్ బాస్లకు కత్తిమీద సాముగా ఉంటుంది. ఈనేప థ్యంలో కమిషనర్ సాయి చైతన్య శిక్షణ పూర్తి చేసిన ఎస్పైలకు పోస్టిం గ్ లు ఇవ్వడానికి ఇవేవి పట్టించుకోలేదు. పైగా కొత్త ఆనవాయితీకి తెరలేపారు. శిక్షణ పూర్తి చేసిన అధికారులలో మహిళా అధికారులం దరూ లా అండ్ ఆర్డర్లో సత్తా చాటేలా వారికి జిల్లాలో ఏకంగా నా లుగు ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియామకం చేశారు. అది కూడా కీలకమైన ఠాణాలు కావడం గమనార్హం. ప్రాంతం అయినా మార్చారు. గతంలో ఈప్రాంతం అత్యంత నక్సల్స్ ప్రాబల్యం ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉండేది. లా అండ్ ఆర్డర్ పరంగా సున్నితమైన ప్రాంతంగా ఉ న్న ఎడపల్లికి ఎస్సైగా ముత్యాల రమాను గిరిజన నివాసులు ఎక్కువగా ఉన్న మోపాల్ ఎస్సైగా సుస్మితను, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరిధిలోకి వచ్చే మెండోరా ఎస్సైగా జాదవ్ సుహాసినిలు నియామకం అయ్యారు. అధికార పార్టీ నుంచి ఎలాంటి సిఫార్స్ లను పట్టించుకోలేదు. ఎస్సైల బదిలీ ప్రక్రియ మొదలవ్వగానే అధికార పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షణలు చేస్తారు. ఉన్నతాధికారుల సంగతి ఎలా అధికార పార్టీ నేత ఆమోదం అనివార్యంగా భావిస్తారు. అందుకే పోలీసు బాస్లు ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించి తమ ఇష్టానుసరం పోస్టింగ్లు ఇవ్వడం దుసాధ్యంగా మారుతుంది. కానీ కొత్వాల్ కొత్త అధికారులకు స్టేషన్లు ఇవ్వడం గట్టిగా నిలబడ్డారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు సొంత నియోజక వర్గాల్లోను మహిళా ఎస్సైలు నియామకం కావడంతో నియా మకాల్లో కమిషనర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.