నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమే: KLRప్రతీ ఇంటికి ప్రజాపాలన సంక్షేమ పథకాలు చేరాయిBJP+ BRS లోపాయికారి ఒప్పందం: కిచ్చెన్న ఆరోపణ
అక్టోబర్ 22 మహేశ్వరం: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మేజార్టీ సాధించబోతుందని సికింద్రాబాద్ జిల్లా అబ్జర్వర్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.గల్లీ గల్లీకి గులాబీ నేతలు మోహరించి… ప్రజాపాలనపై విషప్రచారం చేసినా ఓటర్లు కాంగ్రెస్ కే పట్టం కడతారని కేఎల్ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.మహేశ్వరం నియోజకవర్గం నుంచి ముఖ్యనాయకులు, ఆడపడుచులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రచారంలో పాల్గొంటారని లక్ష్మారెడ్డి తెలిపారు.ఇంటి ఇంటికీ ప్రజాపాలన: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి అందుతున్నాయని కిచ్చెన్నగారు అన్నారు. మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్ ను మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం లాంఛనమే: కేఎల్ఆర్. నవీన్ యాదవ్ గెలుపుతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కేఎల్ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.