దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు
Oplus_131072
సెప్టెంబర్ 2 హైదరాబాద్: దివంగత నేత మాజి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు. ప్రజల సంక్షేమం, ప్రగతి కోసం కృషి చేసిన నేత రాజశేఖర్ రెడ్డి. వైద్యవిద్యను అభ్యసించిన ఈయన విద్యార్థి దశ నుంచే రాజకీయల వైపు ఆకర్షితుడయ్యారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎంగా పలు బాధ్యతలు స్వీకరించారు. ఆరోగ్యశాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి జీతం తీసుకుని ఆదర్శంగా నిలిచారు. ఈయన భౌతికంగా లేకపోయినా.. ప్రజల గుండెల్లో ఎప్పటికి జీవించే ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రచ్చబండ అనే కార్యక్రమంతో ప్రతి గ్రామాలలో వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునేవారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సర్వీసులు ప్రవేశ పెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కి చెందింది. సెప్టెంబర్ 2న హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి చిత్తూరు నల్లమల్ల ఫారెస్ట్ అడవి పావురాల గుట్ట దగ్గర హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.