తెలుగు మీడియం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన తుమ్మలూరు జయకృష్ణ
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 25:రంగారెడ్డి జిల్లా,మహేశ్వరం మండలం,తుమ్మలూరు గ్రామానికి చెందిన గడ్డమీది జయకృష్ణ ప్రసాద్ (తండ్రి:గడ్డమీది యాదయ్య) రాష్ట్రస్థాయి గ్రూప్-1 లో ఉద్యోగం సాధించారు.చిన్న రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం ద్వారా విద్యనభ్యసించిన ఆయన,తన కృషి,పట్టుదలతో గ్రూప్-1లో అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ( ఏటీవో)గా ఎంపికయ్యారు.జయకృష్ణ ప్రసాద్ ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారుగ్రూప్-1ర్యాంక్ 378గ్రూప్-2ర్యాంక్ 94గ్రూప్-3ర్యాంక్ 175ఇదే కాకుండా,రెండు సార్లు సివిల్స్ మెయిన్స్ వరకు చేరి,కేవలం కొద్దిమార్కుల తేడాతో ఆగిపోయారు.అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా,మరింత శ్రమతో తన లక్ష్యాల వైపు ముందుకు సాగుతున్నారు.సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి – సివిల్స్ సాధన బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి,సివిల్ సర్వీసెస్ సిద్ధతకు పూర్తిస్థాయిలో అంకితభావంతో కృషి చేస్తున్నారు.తెలుగు మీడియం నుంచే చదివినా,ఇంగ్లీష్‌పై పట్టు సాధించి,ఉన్నత లక్ష్యాల కోసం సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.జయకృష్ణ ప్రసాద్ విజయగాథ చిన్న రైతు కుటుంబాల పిల్లలకు,గ్రామీణ విద్యార్థులకు గొప్ప ప్రేరణ.ఆయన పట్టుదల,కష్టపడితే ఎలాంటి అడ్డంకులైనా అధిగమించవచ్చని మరోసారి రుజువు చేసింది.