February 22, 2026

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం మరియు భారీ కుంభకోణంపై సిట్ (SIT) నిర్ధారణ _ తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

0
IMG-20260129-WA1108

జనవరి 29 తిరుపతి: మహా పాపం నిజం.. అది నెయ్యి కాదు! పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం”* అనే నినాదంతో ఈ నిరసన కార్యక్రమం స్థానిక పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి గాంధీరోడ్డు నాలుగు కాళ్ళ మండపం వరకు సాగింది. కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి తెదేపా నాయకులతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ..”నెయ్యి సరఫరా చేసిన కంపెనీల ఎంపికలో నిబంధనలు ఉల్లంఘించారని, తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేసే క్రమంలో నాణ్యతను విస్మరించారని గుర్తించారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారంపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రసాదం తయారీలో వాడే వస్తువుల విషయంలో ఆగమ శాస్త్రం చెప్పిన నియమాలను పాటించకపోవడం వల్లే ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో (2019-2024) లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యి కాదని, అది జంతువుల కొవ్వు మరియు రసాయనాలతో కలిపిన “సింథటిక్ ద్రవం” అని సిట్ (SIT) దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. సుమారు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించినట్లు తేలింది. ఈ ద్రవంలో 0% పాల కొవ్వు ఉందని, కేవలం పామాయిల్, పామోలిన్ మరియు కెమికల్ ఈస్టర్స్ వంటి రసాయనాలతో దీనిని తయారు చేసినట్లు ల్యాబ్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ కల్తీ నెయ్యితో దాదాపు 20 కోట్ల లడ్డూ ప్రసాదాలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఈ కల్తీ నెయ్యి సరఫరా ద్వారా వైకాపా పెద్దలు దాదాపు ₹251 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని దర్యాప్తులో వెల్లడైందన్నారు. అంతకముందు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెదేపా నాయకులు, ర్యాలీగా బయలుదేరి నాలుగు కాళ్ళ మండపం వద్దకు చేరుకొని,మానవ హారం గా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, జోన్ 4 మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ,రాష్ట్ర కార్యదర్శి దంపూరు భాస్కర్ యాదవ్, గంగమ్మ గుడి చైర్మన్ మక్కి యాదవ్, కార్పొరేటర్లు,తెదేపా నాయకులు, కార్యకర్తలు,మహిళా నాయకురాలు, ప్రజలు మరియు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed