ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ చెట్కూరి కమలాకర్ యాదవ్
జూన్ 30: ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ చెట్కూరి కమలాకర్ యాదవ్ సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో ఈరోజు శివాజీ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేయడం జరిగింది. హిందూ ధర్మ స్థాపన కోసం అవిశ్రాంత కృషిచేసి.., భ్రమరాంబ మాత ఆశీర్వాదంతో హైందవ రాజ్యాన్ని స్థాపించిన వీరుడి విగ్రహ ఏర్పాటు తమకు సంతోషమకరమని కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చెట్కూరి కమలాకర్ యాదవ్ హాజరయ్యారు. గ్రామంలో శివాజీ ఏర్పాటు అభినందనీయమని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గిరి కరుణా తిరుపతి యాదవ్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నాగులపల్లి కుమార్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బంగారం సాగర్ గౌడ్, బిజెపి నాయకులు ఐలేని మహిపాల్ గౌడ్, నీల సత్యనారాయణ, ఆయా కుల సంఘాల నాయకులు, గ్రామస్థులు.. తదితరులు పాల్గొన్నారు.