చేవెళ్ల బస్సు ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కరమైన విషయం:రాజేంద్ర నగర్ నియోజక వర్గ ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి
నవంబర్ 4 మైలార్ దేవ్ పల్లి: చేవెళ్ల తాండూరు మీర్జాపురం నుంచి ఆలూరు లో జరిగిన అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం సంఘటన జరిగి 21 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కరమైన విషయం అని రాజేంద్ర నగర్ నియోజక వర్గ ఇంచార్జ్ శ్రీ తోకల శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతపని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రదిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ ప్రారంభించి బాధ్యులపై కట్టిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు మృతి చెందిన ప్రతి ఒక్కరికి 5 లక్షల Exgracia నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.