చిలుక మధుర ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న దేప సురేఖ భాస్కర్ రెడ్డి
జనవరి 13 మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం, రామకృష్ణాపురం డివిజన్ పరిధిలోని వాసవి కాలనీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో రామకృష్ణాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్, GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దేప సురేఖ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా కాలనీ వాసులతో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు పంచుకున్నారు. సందర్భంగా దేప సురేఖ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ. 👉మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను అందరూ కలిసికట్టుగా జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. కాలనీలలో ఇలాంటి కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.👉సంక్రాంతిని ‘కోతల పండుగ’ అని కూడా పిలుస్తారు. చేతికి వచ్చిన పంటను చూసి మురిసిపోతూ, ఆ ఆనందాన్ని ప్రకృతితో పంచుకుంటారు. రైతులు తమ శ్రమ ఫలించినందుకు కృతజ్ఞతగా సూర్యభగవానుడికి నైవేద్యాలు సమర్పిస్తారు.👉 ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచి పూలతో అలంకరిస్తారు. ఇది లక్ష్మీ దేవికి ఆహ్వానం పలుకుతుందని నమ్మకం అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ కాలనీల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.