కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న శ్రీరాములు అందెల
ఆగస్టు 16 మహేశ్వరం:శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఈరోజు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు గారు అబిడ్స్ లోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెల గూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరియు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ లోని భగవాన్ శ్రీ రాధాకృష్ణ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం ధర్మానికి, నైతికతకు మరియు ప్రజాస్వామ్యానికి నిలువెత్తు ఉదాహరణ అని యువత ఆయన బోధనలను ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు తులసి ముకేశ్ ముదిరాజ్, పసునూరి బిక్షపతి చారి, మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, భీమ్ రాజ్, బిజెపి సీనియర్ నాయకులు గాజుల మధు, రాజశేఖర్, భువనచందర్, యాతం వెంకటేష్ యాదవ్, నిఖిల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.