ఐక్యరాజ్యసమితి (ACABQ) చైర్‌పర్సన్ శ్రీమతి జూలియానా గాస్పర్ రుయాస్ మరియు UN (ASGF&BC) అయిన శ్రీ చంద్రమౌళి రామనాథన్ గారితో సమావేశమయ్యారు; ఎంపీ గడ్డం వంశీకృష్ణ
అక్టోబర్15 పెద్దపల్లి:
భారత దేశానికి చెందిన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు 🇮🇳, పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీ కృష్ణ గారు సహా, ఐక్యరాజ్యసమితి 🇺🇳 Advisory Committee on Administrative and Budgetary Questions (ACABQ) చైర్‌పర్సన్ శ్రీమతి జూలియానా గాస్పర్ రుయాస్ మరియు UN Assistant Secretary-General for Finance & Budget మరియు Controller అయిన శ్రీ చంద్రమౌళి రామనాథన్ గారితో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా శాంతి భద్రతా కార్యకలాపాల (Peacekeeping Operations) నిధులపై విస్తృత చర్చలు జరిగాయి.
భారత ప్రతినిధులు ప్రపంచ శాంతి పరిరక్షణలో భారతదేశం పోషిస్తున్న కీలక పాత్రను పునరుద్ఘాటిస్తూ, ఐక్యరాజ్యసమితి వ్యవస్థల్లో పారదర్శకత, బాధ్యత, సమర్థత వంటి అంశాలపై తమ సూచనలు అందించారు. ఈ సమావేశం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో భారతదేశ స్వరాన్ని మరింత బలంగా ప్రతిధ్వనింపజేసే దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది.