ఏపీఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో ప్రభు సూర్య మూవీ షూటింగ్ విజయవంతం
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా: ఏపీఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ప్రభు సూర్య దర్శకత్వంలో,శ్రీనివాస్ మేడిగ నిర్మిస్తున్న తొలి చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తి అయ్యింది.ఈ చిత్రంలో విజయ్ హీరోగా,సీతల్ భట్ హీరోయిన్గా నటిస్తున్నారు.అలాగే రవివర్మ,జ్యోతి,చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు.నిర్మాత సన్నిహితుడు ఎస్వి ఇన్ఫ్రా చైర్మన్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు,తెలుగు భాష పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనుమరాలు క్రాంతికృష్ణ హోం మినిస్టర్‌గా పవర్ఫుల్ పాత్రలో నటించారు.సినిమా టైటిల్ పోస్టర్ ప్రముఖ నటుడి చేతుల మీదుగా విడుదల కానుంది అని తెలిపారు.సాంకేతిక జట్టు:దర్శకత్వం:ప్రభు సూర్య,డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: కె.వి గోలంధర్రచయిత: రవితేజ కమ్మంపాటి,సంగీతం: మహావీర్,నిర్మాత: శ్రీనివాస్ మేడిగ