ఎన్నికల సామగ్రితో సిద్ధంగా ఉండాలి: పంచాయతీరాజ్ శాఖ
Oplus_0
జూలై 17 హైదరాబాద్: రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన డెడ్లైన్ సెప్టెంబర్ 30 లోపు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా సన్నాహాలు చేయాలని చెప్పింది. అన్ని జిల్లా పరిషత్ సీఈవోలు, పంచాయతీ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయి ఎన్నికల సామగ్రితో సిద్ధంగా ఉండాలని పేర్కొంది.