ఎన్టీఆర్ 12 చారిత్రక చిత్రాల్లో నటించారు. ఇతరుల దర్శకత్వంలో నటించే చిత్రమైనా, స్వీయ దర్శకత్వంలో నటించే చిత్రం అయినా ఎన్టీఆర్ అనుసరించే పద్ధతి ఒకే రకంగా ఉంటుంది
సెప్టెంబర్16 హైదరాబాద్: ”కళాకారుడికి నిర్భంధాలు వుండకూడదు అని నమ్మే మనిషిని నేను. అలా రచయితలు తమ ఇష్టప్రకారం స్ర్కిప్ట్ అంతా సిద్దపరిచాక దాన్ని స్వహస్తాలతో తిరగరాసుకుంటాను. అలా రాసినప్పుడు ఆ డైలాగ్ మీద పూర్తి అజమాయిషీ వచ్చేస్తుంది. మొదటి డైలాగ్ నుంచి చివరి డైలాగ్ వరకు,మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు వివరంగా డైరెక్టర్స్ డైరీ లాంటి పుస్తకం తయారవుతుంది. సెట్ మీదకు వచ్చాక ఆ స్ర్కిప్ట్ మార్చే ప్రసక్తే వుండదు.ఏయే ఆర్టిస్ట్‌లను ఎన్నుకోవాలి, డైలాగ్ ఏలా పలకాలి, ఏ షాట్ ఎలా చిత్రీకరించాలి, అనే విషయం మీద ముందుగా నిర్ణయాలు తీసుకుంటాను. నా చిత్రం సెట్స్ మీదకు వెళ్లక ముందే… మొత్తం చిత్రం నా మనో ఫలకంమీద ముద్రితమై వుంటుంది. అందుకే నా చిత్రానికి నేనే మొదటి ప్రేక్షకుడిని.ఒకవేళ అలా మొత్తం చిత్రాన్ని చూడలేకపోతే అ వ్యక్తి దర్శకుడు కాలేడు. అతని పనిలో నైపుణ్యం వుండదు” … దర్శకత్వం గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలివి.