ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
కూకట్ పల్లి డిసెంబర్ 14: ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ వెంకటేశ్వర నగర్ దీనబందు కాలని లోని శివ భక్త ఆమార్కండేయ గుడి లో ఆదివారం ఉదయం క్యాలెండర్ ఆవిష్కరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు, ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి అన్న సత్రం యాదగిరి గుట్ట అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు, అధ్యక్షులు చిట్టిపోలు బిక్షమయ్య. ప్ర.కార్యదర్శి కోడూరి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీ పుట్ట శివ శంకర్, శ్రీ సుంకనపల్లి మోహన్, శ్రీ వంగరి విష్ణు, ముఖ్య సలహాదారులు శ్రీ బాస శంకరయ్య, కన్వీనర్ శ్రీ దాసపత్రి అశోక్ కుమార్, కోశాధికారి శ్రీ పెద్దూరి నర్సింహా రాములు ఆల్విన్ కాలని పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.