December 24, 2025

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై AAIB నివేదిక

0
IMG-20250712-WA1331

జులై 12 న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై AAIB నివేదిక.ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో ముఖ్యమైన విషయాలు.విమానం స్టార్ట్‌ అయ్యాక గరిష్ఠ వేగాన్ని అందుకుంది.అదే సమయంలో ఇంజిన్‌ 1, ఇంజిన్‌ 2 ఆగిపోయాయి.ఫ్యుయెల్ స్విచ్‌లు రన్‌ నుంచి కటాఫ్‌కు మారాయి.సెకన్ల వ్యవధిలో ఇంజిన్లకు నిలిచిపోయిన ఫ్యుయెల్.ఇంజిన్‌ను ఎందుకు ఆఫ్‌ చేశారని..పైలట్‌ను అడిగినట్టు కాక్‌పిట్‌లో రికార్డయింది.రెండో పైలట్‌ తాను ఇంజిన్‌ను ఆఫ్‌ చేయలేదని చెప్పాడు.టేకాఫ్‌ అయిన వెంటనే విమాన RAT బయటకొచ్చింది.రెండు ఇంజిన్ల స్విచ్‌లను రన్‌లో తిరిగి ఉంచారు.ఇంజిన్‌ 1లో రీలైటింగ్‌ ప్రక్రియ విజయవంతమైంది.ఇంజిన్‌ 2 ప్రారంభమైంది కానీ పవర్‌ అందుకోలేదు.మ.1:39కి పైలట్‌ మేడే కాల్‌ ఇచ్చారు-AAIB నివేదిక.ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రెస్పాన్స్‌ అయ్యింది.కానీ పైలట్‌ నుంచి తిరిగి రెస్పాన్స్‌ రాలేదు.ఎయిర్‌పోర్టు గోడను దాటే ముందు విమానం కూలిపోయింది.సీసీ ఫుటేజ్‌లో పక్షి ఢీకొన్న సంఘటన ఏదీ కనిపించలేదు.మ.1:44 గంటలకు ఫైరింజన్లు వెళ్లాయి-AAIB నివేదిక.ప్రమాద స్థలాన్ని డ్రోన్‌తో రికార్డింగ్‌ జరిగింది. శిథిలాలను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. ఇంజిన్లు, ఇతర భాగాలను పరీక్షించేందుకు భద్రపరిచారు.విమానంలో ఫ్యుయెల్‌ సరైనదేనని తేలింది-AAIB నివేదిక

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed