బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ గారి ఆధ్వర్యంలో HMDA పరిధిలో రైతుల సమస్యల పై చర్చా వేదిక నిర్వహించారు
డిసెంబర్ 20 హైదరాబాద్: బండారు దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ గారి ఆధ్వర్యంలో 20 డిసెంబర్, 2025 తేదీన HMDA పరిధిలో రైతుల సమస్యల పై చర్చా వేదిక హైదరాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ, హైదరాబాద్ నందు నిర్వహించడం జరిగింది. ఈ చర్చా వేదిక లో లోక్ సత్తా అధ్యక్షులు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు, శ్రీ బూర నర్సయ్య గౌడ్ మాజీ పార్లమెంట్ సభ్యులు, పద్మశ్రీ చింతల వెంకట్ రెడ్డి ఆదర్శ రైతు, డాక్టర్ ఎస్. మల్లా రెడ్డి మాజీ సర్పంచ్ చర్చా వేదిక సంయోజకులు, శ్రీ కె.ఎస్.రత్నం మాజీ శాసన సభ్యులు, శ్రీమతి నిర్మల గోనెల విశ్రాంత ఐఏఎస్, శ్రీమతి కరుణ గోపాల్ ఫ్యుటరిస్టిక్ సిటీస్ వ్యవస్థాపకురాలు మరియు HMDA పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొనడం జరిగింది.
శ్రీ బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ గారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ :
• రాష్ట్ర ప్రభుత్వం HMDA మాస్టర్ ప్లాన్ లో అమాయక, పేద రైతులకు నష్టకరంగా జోన్ల నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గత 11 సంవత్సరాలుగా జోన్లు మార్పులకు నోచుకోలేదని, రైతులకు అనుకూలంగా రెక్రీషనల్ జోన్ల నుండి ముల్తిప్లె జోన్ లకు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం 7257 చ. కిమీ. విస్తీర్ణంతో 2013 లో మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, ప్రస్తుతం HMDA పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి జిల్లాలలోని 70 మండలాలు, 24 మునిసిపాలిటీలు, 8 మునిసిపల్ కార్పొరేషన్లు, సుమారు 750 గ్రామాలు ఉన్నాయని, అయితే ఇటీవల 20 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లను GHMC లో విలీనం చేయడం జరిగిందని, మస్టర్ ప్లాన్ వల్ల ప్రణాళికా బద్దమైన అభివృద్ధి ఏమోగానీ రైతుల పాలిట మాత్రం శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాస్టర్ ప్లాన్ లో భూములను కన్సర్వేషన్ (వ్యవసాయం) పబ్లిక్-సెమి పబ్లిక్, రిక్రియేషన్, ఓపెన్ స్పేస్, ట్రాఫిక్, రవాణా, పెరి-అర్బన్, రెసిడెన్సియల్ (నివాస), కమర్షియల్ (వాణిజ్య), ఇండస్ట్రియల్ (పారిశ్రామిక), మల్టిఫుల్ (బహుళ ప్రయోజన) తదితర జోన్లుగా విభజించడం జరిగిందని, పేద, అమాయక, సన్న, చిన్నకారు రైతుల భూములు ఇండ్ల నిర్మాణానికి కూడా అవకాశం లేని కన్సర్వేషన్ లాంటి జోన్లలో ఉన్నాయని, ఈ కారణంగా దాదాపు 50 వేల మంది రైతులు తమ భూములలో సొంత ఇల్లు కూడా నిర్మించుకునే పరిస్థితి లేదని, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బాబులు, పలుకుబడి గల వారి భూములు ఎన్ని అంతస్తులైనా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉండే రెసిడెన్సియల్, ముల్టీపుల్ జోన్లలో ఉన్నాయని శ్రీ దత్తాత్రేయ గారు పేర్కొన్నారు.
పేదలు – ధనవంతుల మధ్య ఉండే అంతరం ఇక్కడే తెలుస్తుందని, వీరు వందల కోట్లకు పడగలెత్తుతుండగా పేదలు పేదవారుగానే మిగిలిపోతున్నారని, ఎకరా, రెండెకరాల భూమి ఉన్న రైతులు కూడా సొంత ఇండ్లకు దూరమవుతున్నారు. భూమి ఉన్నా కుటుంబం గడవని దయనీయ పరిస్థితి ఉందని, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలన్నింటిని మునిసిపాలిటీలుగా మార్చి GHMC లో విలీనం చేయడం జరిగిందని, ఈ పరిస్థితిలో రింగ్ రోడ్ లోపల ఉన్న భూములను కన్సర్వేషన్ / ఓపెన్ / రిక్రియేషన్ తదితర జోన్ల లో ఉంచడంలో అర్థమే లేదని, రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న మాస్టర్ ప్లాన్ ను తక్షణమే మార్చి రైతులకు అనుకూలమైన రీతిలో రూపొందించాలని, గ్రోత్ కారిడార్ లో ప్రతిపాదించిన 100 అడుగుల వెడల్పు గల గ్రిడ్ రోడ్డు విషయం పై పునః పరిశీలన చేయాలి ప్రభుత్వాన్ని శ్రీ బండారు దత్తాత్రేయ గారు డిమాండ్ చేశారు.
డాక్టర్ ఎస్. మల్లా రెడ్డి మాజీ సర్పంచ్
చర్చా వేదిక సంయోజకులు
9440901313