కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆశీస్సులతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం – శ్రీరాములు అందెల
డిసెంబర్ 19 మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థులు తమ వార్డు మెంబర్లతో కలిసి మండల అధ్యక్షులు నిమ్మ అంజి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు గారిని నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ మరియు పాలకవర్గాన్ని శ్రీరాములు గారు ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీరాములు గారు మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారి ఆశీస్సులతో అదే విధంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామంలోని చిట్టచివరి వ్యక్తి వరకు చేరేలా కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు సూచించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లోను ఇదే సత్తాను కొనసాగించి భారతీయ జనతా పార్టీకి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకట్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గానుగుపేట అంజమ్మ, ఆకులమైలారం సర్పంచ్ ఏ నరేష్, బేగంపేట్ సర్పంచ్ జాపాల పూజా హరిబాబు, దాసర్లపల్లి సర్పంచ్ టేకుమట్ల బాలరాజు, ఆకులమైలారం ఉప సర్పంచ్ అచ్చన్న సురేష్, వార్డు మెంబర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, బీజేవైఎం నాయకులు మరియు వివిధ గ్రామస్తులు పాల్గొన్నారు.