విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వివిధ రకాలైన వృత్తుల గురించి అవగాహన కార్యక్రమం
డిసెంబర్ 20 శ్రీకాళహస్తి: విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ రోజు వివిధ రకాలైన వృత్తుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. చిన్నారులందరూ, డాక్టర్, యాక్టర్, ఇంజనీర్, రైతు, సైనికుడు, పోలీసు లాంటి వివిధ వృత్తుల వారి వేషధారణలతో అలరించారు. పాఠశాల డైరెక్టర్ సుబ్బరామిరెడ్డి గారు,మన సమాజంలో ఎన్నిరకాల వృత్తులు ఉన్నవి వాటి గురించి పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో వాళ్లు ఏదో ఒక వృత్తిలో రాణిస్తారని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రామ్ ఉమా సింగ్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.