తెలంగాణ నుండి — ఆంధ్రప్రదేశ్ నుంచి వరకు ధైర్యప్రయాణం!: ఏ. రమాదేవి
అక్టోబర్ 27 హైదరాబాద్:పోలీస్ యూనిఫాం కేవలం బాధ్యత కాదు, ప్రజాసేవ అనే విలువకు ప్రతీక అని నిరూపించిన పేరు ఏ. రమాదేవి (IPS). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి తెలంగాణ వరకు, ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. సేవా తపన, ధైర్యం, నిబద్ధత, క్రమశిక్షణల సమ్మేళనంగా ఈ మహిళా అధికారి ఆమె…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరంభం – ధైర్యసాహసాల పునాది
ఏ. రమాదేవి పోలీస్ కెరీర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ (DSP) హోదాతో ప్రారంభమైంది.
తన ప్రారంభ నియామకాల్లోనే క్రమశిక్షణ, ప్రజా సేవ, నిజాయితీ పట్ల తడబాటు లేని దృక్పథం చూపించారు. కొంత కాలం హైదరాబాద్ లో పనిచేసారు. రాష్ట్రం విడిపోయాక విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఏలూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో క్రమశిక్షణా నియంత్రణ, మహిళా భద్రతా చర్యలు, నేరపూరిత కార్యకలాపాల అణచివేతలో కీలక పాత్ర పోషించారు.ఆ సమయం లోనే ఆమె ధైర్య నిర్ణయాలు, తక్షణ స్పందన, పౌర సంబంధాల మెరుగుదలకు చేసిన కృషి వలన
“డైనమిక్ లేడీ ఆఫీసర్” అనే గుర్తింపు సంపాదించారు.
మహబూబాబాద్ డీఎస్పీగా గుర్తుండిపోయిన కాలం
ఉమ్మడి రాష్ట్రం విభజనకు ముందు, రమాదేవి మహబూబాబాద్ డీఎస్పీగా పని చేశారు. ఈ కాలం ఆమె కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ఘట్టంగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను నియంత్రించడంలో, పోలీస్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం పెంపొందించడంలో ఆమె పూనుకున్న చర్యలు విస్తృత ప్రశంసలు పొందాయి. ప్రత్యేకించి
అక్రమ గనుల నియంత్రణ,మహిళా భద్రతా అవగాహన కార్యక్రమాలు,
సామాజిక శాంతి భద్రతా సమావేశాలు, పోలీస్-ప్రజా మైత్రి కార్యక్రమాలు అన్నీ ఆమె సారథ్యంలో విజయవంతంగా జరిగాయి.
తెలంగాణలో కొత్త దశ – ఆంధ్రలో నూతన దృష్టి, నూతన దిశ
రాష్ట్ర విభజన తర్వాత రమాదేవి తన కెరీర్ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. ఇక్కడ ఆమె తన స్ఫూర్తిని నిలబెట్టుకున్నారు.
ప్రముఖ విభాగాలలో ఆమె స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్, ఏసీబీ విభాగాల్లో పనిచేశారు. మహిళా పోలీస్ సిబ్బందికి శిక్షణా మార్గదర్శకాలు రూపొందించడంలో, ఆధునిక టెక్నాలజీ వినియోగంలో ఆమె కృషి గణనీయంగా ఉంది. డీఎస్పీ, ఎఎస్పీ నుండి ఆమె నాన్ క్యాడర్ ఐపీఎస్ గా పదదోన్నతి పొంది ప్రస్తుతం ఆమె (ఇంటలిజెన్స్) ఎస్పీ హోదాలో రాష్ట్ర భద్రతా వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నేరాలను శాస్త్రీయ దృష్టితో విశ్లేషించే విధానం, ఫీల్డ్ ఇంటెలిజెన్స్ కలయికతో పనిచేసే విధానం ఆమె ప్రత్యేకత.
ప్రజా సేవలో మారని మమకారం
రమాదేవి వృత్తి జీవితం మొత్తంలో ఒకే లక్ష్యం ఒక్కటే ప్రజలతో మమేకం అని స్పష్టంగా కనిపిస్తుంది…ప్రజల భద్రతే పోలీస్ వ్యవస్థ యొక్క నా ఆత్మ అని ఆమె ఎప్పుడు చెపుతుంది. పోలీసుల మానవతా వైఖరి పట్ల ఆమె చేసిన ప్రోత్సాహం, మహిళా అధికారిణుల ఎదుగుదలకు చేసిన సహకారం
పోలీస్ వ్యవస్థలో ఒక స్ఫూర్తిదాయక ముద్రగా నిలిచాయి.
గౌరవం – గుర్తింపు – స్ఫూర్తి
తన నిజాయితీ, క్రమశిక్షణ, ధైర్య నిర్ణయాల వలన రమాదేవి పలు ప్రభుత్వ, పోలీస్ అవార్డులు అందుకున్నారు. సమాజం పట్ల నిబద్ధత, సర్వీస్ పట్ల సమర్పణ ఆమెను నేటి తరం మహిళా అధికారులకు ఒక రోల్ మోడల్ గా నిలబెట్టాయి.“డైనమిక్, డెడికేటెడ్, డిసిప్లిన్డ్ — ఏ. రమాదేవి పోలీస్ వ్యవస్థకు ప్రేరణా శక్తి.”
డీ. వై. గిరి
(సీనియర్ జర్నలిస్టు)
హైదరాబాద్ తెలంగాణ
సెల్ : 7013667743