https://www.facebook.com/share/p/17f1f3gQ3G/
మరిన్ని ఫోటోలు
తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మతల్లి ఆలయ కమిటీ పాలకవర్గం ఎన్నిక
అక్టోబర్ 27 తుక్కుగూడ: ఆలయ కమిటీలోనూ అన్ని వర్గాలకు అవకాశం: KLR
కొలువుదీరిన రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ గుడి పాలక వర్గం.ఆలయ విశిష్టత, అభివృద్ధి పెరిగేలా చూడాలి అని అన్నారు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. సామాజిక ధృక్పథంతో అన్ని వర్గాల వారికి ఆలయ కమిటీలో ప్రాధాన్యత కల్పించామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మతల్లి ఆలయ కమిటీ పాలకవర్గం ఇవాళ కొలువుదీరింది. గుడి శాశ్వత ఛైర్మన్ రెడ్డిగళ్ల రత్నం సహా ఆరుగురు కమిటి సభ్యులు గొనేమోని బాలరాజ్, తొండేటి గోవర్ధన్ రెడ్డి, పటోళ్ల అర్జున్, ఎరుకల శ్రీలత, మద్దుల చంద్రశేఖర్ రెడ్డి, కొటగళ్ల పల్లవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేఎల్ఆర్… పాలకవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవాలయానికి మంచి పేరు, అభివృద్ధి, ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. నిజాయితీ, ధైవభక్తితో పని చేసి ప్రతీ భక్తుడికి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనభాగ్యం కలిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ రావు, దేవాదాయశాఖ అధికారి ప్రణీత్ సహా డైరెక్టర్ల కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు.