చిరు వ్యాపారులకు అండగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సీతాఫలం అమ్ముతున్న చిన్న వ్యాపారులను స్వయంగా ప్రోత్సహించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యే
అక్టోబర్ 16 మహేశ్వరం:మహేశ్వరం:పలు సామాజిక,ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోడ్డుపై సీతాఫలం (రామఫలం) అమ్ముతున్న చిన్న వ్యాపారులను గమనించి,కారు ఆపి ఆప్యాయంగా పలకరించారు.సబితా స్వయంగా సీతాఫళాలను కొనుగోలు చేస్తూ,చిన్న వ్యాపారులను ప్రోత్సహించడం ద్వారా వారికి ఆదరణ చూపించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ:-చిరు వ్యాపారులు మన సమాజంలో ఆర్థికంగా బలపడేందుకు మనందరం సహకరించాలి.పెద్ద మాల్స్ కంటే,మన చుట్టుపక్కల శ్రమించి జీవనోపాధి పొందే వారిని ప్రోత్సహించడం అవసరం.వారిని ఆదుకోవడం మన బాధ్యత,అని పేర్కొన్నారు.స్థానికులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సానుభూతి, మానవతా దృక్పథాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.