ఏకాభిప్రాయంతోనే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక. – అనిల్ కుమార్ యాదవ్
అక్టోబర్ 16 శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తిచేసే దిశగా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం శేరిలింగంపల్లి సమన్వయ కమిటీ సమావేశం M.S.P కన్వెన్షన్ హాల్ లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అబ్జర్వర్లు తమిళ్నాడు M.P రాబర్ట్ బ్రూస్, టీపీసీసీ ఉపాధ్యక్షులు కోటింరెడ్డి వినయ్ రెడ్డి గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఏఐసీసీ, టీపీసీసీ అబ్జర్వర్లు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ (డిసిసి) కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం అభిప్రాయాలు సేకరించేందుకు ఈ సమావేశానికి విచ్చేసామని తెలియజేశారు, నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి ఈ నెల 22 న ఏఐసీసీకి నివేదిక అందిస్తామని తెలిపారు. మెజార్టీ అభిప్రాయం మేరకు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు.అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ గారు మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా, అందరి అభిప్రాయం మేరకు, అన్ని అంశాలను పరిగణలకు తీసుకుని ఏఐసీసీ. డీసీసీ అధ్యక్షుడి నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఓట్ చోరీ అంశానికి సంబంధించి మాట్లాడుతూ…ఇప్పటికే లోక్ సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీకి సంబంధించి ఆధారాలు బయటపెట్టిన, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుండా బిజెపి కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తుందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ స్థానంలోని మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక లక్ష 250 ఓట్లు దొంగ ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ గాంధీ ఆధారాలను బయటపెట్టిన, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుండా, ఓట్ చోరిని బయటపెట్టిన రాహుల్ గాంధీ ని క్షమాపణ చెప్పాలని, అఫిడవిట్ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరడం దుర్మార్గమన్నారు, స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం బిజెపి చెప్పు చేతల్లో పనిచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ల పై మాట్లాడుతూ… బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయిలు బిఆర్ఎస్ – బిజెపి పార్టీలని ధ్వజమెత్తారు, కులగణన చారిత్రాత్మక నిర్ణయమని, పారదర్శకంగా నిర్వహించామని, బిజెపి – బిఆర్ఎస్ కలిసి బిసి రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని, తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బిల్లును గవర్నర్ వద్ద ఆపింది బిజెపి ప్రభుత్వం కాదా అంటూ కిషన్ రెడ్డిని సూటిగా నిలదీశారు.