Change block type or style
Oplus_131072
Block Paragraph is at the beginning of the content and can’t be moved up
Move Paragraph block from position 1 down to position 2
“నమ్మకం” మన జీవితం నడిచే మార్గంలో అత్యంత విలువైన మెట్టు. తొలి అడుగు మన గమ్యానికి చేర్చి దారి.
అక్టోబర్ 11 హైదరాబాద్: “నమ్మకం” మన జీవితం నడిచే మార్గంలో అత్యంత విలువైన మెట్టు.
ఇది రెండు హృదయాలను కలిపే ఓ అపురూపమైన వారధి. దాన్ని నిర్మించడం ఓ శ్రమ, నిలబెట్టడం ఓ నైపుణ్యం, కానీ ధ్వంసం కావడానికి కేవలం ఒక క్షణమే చాలు.
“నమ్మకం “మాట కాదు ఒక బంధానికి రేఖ లాంటిది.
ఇది ఒక మనిషిని మరొకరి జీవితానికి దగ్గర చేస్తుంది. కానీ అదే నమ్మకం దెబ్బతింటే – మనసు శూన్యంగా మారుతుంది.
“నమ్మకం… మనిషి జీవితంలో కనిపించదగిన గొప్ప సంపద!”
నమ్మకం అనేది ఇద్దరి మధ్య ఒక దృశ్యానికి కనిపించని వారధి. దాన్ని నిలబెట్టుకోవడం ఒక గొప్ప కళ.
అది నెమ్మదిగా ఏర్పడుతుంది… ఒక మనిషి మళ్ళీ మళ్ళీ తన నిజాయితీతో మన హృదయంలో స్థానం సంపాదిస్తాడు. కానీ అది పోవడానికి ఒక్క క్షణమే చాలు.
నమ్మకం అనేది బంధానికి పునాది. ప్రేమ, గౌరవం, బాధ్యత అన్నీ దాని మీదే నిర్మితమవుతాయి. నమ్మకం లేకపోతే, బంధం గాలికొదిలిన గుడిసెవంటిది కూలిపోతుంది.
ఒకరిపై నమ్మకాన్ని కోల్పోయినప్పుడు బాధపడకండి… దూరంగా ఉండడం మనశ్శాంతికోసం అవసరమవుతుంది. ఎందుకంటే మన శాంతే మన గొప్పదనం.
మితిమీరిన నమ్మకం, మితిమీరిన అహంకారంతో సమానం. ఎవరినీ నమ్మే ముందు వారి నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో శబ్దాలు తీపిగా ఉన్నా… ఉద్దేశాలు విషంగా ఉంటాయి.
నమ్మకం కలిగిన బంధం ప్రేమతో… బాధ్యతతో నిండి ఉంటుంది. బంధం చిగురించాలంటే నిజాయితీ ఉండాలి. ఒకసారి నమ్మకం దెబ్బతింటే, ఆ బంధం మళ్లీ పుట్టదు. క్షమించడం సాధ్యమవుతుంది, కానీ మళ్ళీ నమ్మడం సాధ్యం కాదు!
అందుకే..నమ్మకాన్ని కొంటె మాటలకు కాదు, కట్టుబాట్లకు ఇవ్వాలి. మనశ్శాంతిని దెబ్బతీసే బంధాల కన్నా, దూరంగా ఉండే ఒంటరితనమే మంచిది.
ఈ ప్రపంచంలో మనకు మనమే నిజంగా ఉండగలగడం అదే గొప్ప ధైర్యం.
నమ్మకంగా ఉండండి… నమ్మకంగా బ్రతకండి…
ఎందుకంటే, చివరికి మన శాంతే, మన సంపద.
*_జీవితంలో “నమ్మకం కోల్పోతే మనిషి నిలబడలేడు… నమ్మకం నిలబడితే జీవితమే గెలుస్తుంది!”☝️