బస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ – సబిత,సుదీర్ అరెస్ట్
మన ఊరి న్యూస్ ప్రతినిధి ఈ.పద్మారావు కాపు అక్టోబర్ 09:హైదరాబాద్: పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో బస్ భవన్ కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులను పోలీసులు అంబర్‌పేట్‌లో అడ్డుకొని అరెస్ట్ చేశారు.ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు బస్ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.