ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దనీదేవి అలంకర.!మహిష మస్తక నృత్త వినోదిని
అక్టోబర్ 1 హైదరాబాద్: స్ఫుట రణన్మణి నూపుర మేఖలా
జనన రక్షణ మోక్ష విధాయిని
జయతి శుంభ నిశుంభ నిషూదని
నవరాత్రుల్లో మహర్నవమిగా పేర్కొనే తొమ్మిదవరోజు అమ్మవారు మహిషాసుర మర్దనిగా అవతారం దాల్చుతుంది.
#మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. #దుష్టశిక్షణ , శిష్ట రక్షణ చేసి లోకం సుఖ శాంతులతో విలసిల్లే విధంగా కటాక్షించి పాడుతుంది. ఈరోజు అమ్మను సేవింపడంవల్ల మన ఆపదలు , భయాలు అన్నీ తొలగుతాయి.
సనాతని అయిన ఈ తల్లే మహాకాళి , త్రిపుర సుందరి , దుర్గ , గౌరి మొదలైన నామాలతో పిలువబడుతున్నది.
#సర్వాధిష్ఠాత్రి , శివరూపిణి , అన్నపూర్ణ , రాజరాజేశ్వరి , ధర్మం , సత్యం , పుణ్యం , యశస్సు , మంగళాలను ప్రసాదించేది. మోక్షదాయిని. #ఆనంద ప్రదాయిని. శోకనాశిని , ఆర్తివినాశిని , తేజస్వరూపిణి , అమ్మవారి పరిపూర్ణ రూపాలలో పరిపూర్ణమైనది. ఈ తల్లి దుష్ట సంహారిణి , శిష్ట సంరక్షణి , మహిషాసుర , చండముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తి. కరుణ కురిపించి కాపాడే సౌజన్యమూర్తి , కారుణ్యమూర్తి.
రాక్షసులు దేహమే తామనుకుంటూ దేహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉండేవారు. అందరి దగ్గర శక్తిని గ్రహించేవారు. దేవతలంటే అందరికీ తమ శక్తిని ధారపోసేవారు. అందుకే ఇచ్చేవారు దేవత , తీసుకునేవారు (అసురులు) రాక్షసులు అవుతున్నారు. మహిషం అజ్ఞానానికి సంకేతం. మూర్ఖత్వానికి సంకేతం. తాను నమ్మిన సిద్ధాంతంలో మంచి , చెడుల వివక్షణ లేనివాడు మహిషాసురుడు. తన చుట్టూ అటువంటి సామ్రాజ్యాన్నే పెంచుకున్నాడు. అటువంటి అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞానం చైతన్యమనేటువంటి విజ్ఞాన ఖడ్గముతో యుద్ధము చేసి వధింపటమే మహిషాసుర మర్దినీ తత్వం.
జయజయహే మహిషాసుర మర్దని రమ్యక పర్దిని శైలసుతే అంటూ అమ్మవారిని ఉగ్రచైతన్య రూపిణిగా కొలవటం వల్ల మనలో ఉండేటటువంటి కామ , క్రోధ , మోహాదులు అన్నిటికన్నా ముఖ్యమైన జడత్వం , మూర్ఖత్వం అన్నీ నశింపబడతాయి. #ఈ దేహము ఈ లోకానికి వచ్చినప్పుడు లోకాన్ని వినియోగించుకోవడం కన్నా లోకానికి వినియోగపడాలి. #అలా వినియోగ పడేట్లుగా తయారు చేయడమే ఈ ప్రత్యేకమైన మహిషాసురమర్దినీ తత్వం. అనేక బాహువులు , అనేక ఆయుధాలతో కూడుకున్న అమ్మవారు రూపం ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీరాన్ని మనసును ఆవరించుకున్నటువంటి ఎన్నో రకాల లోపాలు తొలగడానికి ఇటువంటి రూపమే అవసరమౌతుంది. #భయం లేకపోతే లోకం మాట వినదు కదా. మన వెనక ఎవరో భయపెట్టేవారు ఉన్నారనుకున్నప్పుడే మనం కొంచం క్రమశిక్షణలో ఉంటాము. ఆ తత్వ ఉపాసన ఈ రూపం ద్వారా జరుగుతుంది.
#ఉపాసకులకు ఈమె ఆనందదాయిని. బద్ధకస్తులకు భయం కలిగించేది. అజ్ఞానంమీద విజ్ఞానం , బాధల మీద విజయం పొందే తత్వమే ఈ అమ్మవారు పూజలో పరమలక్షం.
దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి.
మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసురా ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. #పితామహా నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకల ప్రాణి కోటికి సహజ ధర్మాలు.
మహాసముద్రాలకూ , మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు. #అప్పుడు మహిషాసురుడు విధాతా అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడ్డాడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు.
బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.
శారదా శివుని తేజము ముఖముగా , విష్ణు తేజము బాహువులుగా , బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును , విష్ణువు చక్రమును , ఇంద్రుడు వజ్రాయుధమును , వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల , కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరుసల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు , మహాహనుడు , అసిలోముడు , బాష్కలుడు , బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది.
ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము , సింహరూపము , మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.
ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు.
విద్యార్థులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా. అయ్యవారికి చాలు అయుదు వరహాలు , పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్తులు అయ్యవారికి ధన రూపంలోనూ , పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ నూతన వస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అనావాయితిగా వస్తుంది.
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.
మహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.
చండీ సప్తశతీ హోమము చేయవలెను.
నివేదన: చిత్రాన్నము , గారెలు , వడపప్పు , పానకము నివేదన చేయవలెను.
శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి
ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మయాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహాబుద్ధ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహా బలాయై నమః
ఓం మహా సుధాయై నమః
ఓం మహా నిద్రాయై నమః
ఓం మహా ముద్రాయై నమః
ఓం మహోదర్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాజయాయై నమః
ఓం మహాతుష్ట్యై నమః
ఓం మహా లజ్జాయై నమః
ఓం మహా ఢృత్యై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాకాంతాయై నమః
ఓం మహాస్మృత్యై నమః
ఓం మహాపద్మిన్యై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహా భోదాయై నమః
ఓం మహా తపసే నమః
ఓం మహా సంస్థానాయై నమః
ఓం మహారవాయై నమః
ఓం మహా రోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాబంధసంహార్యై నమః
ఓం మహాభయ వినాశిన్యై నమః
ఓం మహానేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహావక్షసే నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామహీరుహాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం మహాఛాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహాపర్వతనందిన్యై నమః
ఓం మహాబ్రహ్మమయై నమః
ఓం మహామాత్రవే నమః
ఓం మహాసారాయై నమః
ఓం మహాసురగ్న్యై నమః
ఓం మహత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం చర్చితానందాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాంత్యై నమః
ఓం మహాభ్రాంత్యై నమః
ఓం మహా మంత్రాయై నమః
ఓం మహీమ్యై నమః
ఓం మహామహికులాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం మహానీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాకలాయై నమః
ఓం మహాచిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహాహేతవే నమః
ఓం మహాయశస్విన్యై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహా సాధ్యాయై నమః
ఓం మహా సత్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహాసుఖిన్యై నమః
ఓం మహాదుఃస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షప్రదే నమః
ఓం మహాపక్షాయై నమః
ఓం మహీయస్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహావాణ్యే నమః
ఓం మహారోగవినాశినే నమః
ఓం మహాధారాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహామార్యే నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహాక్షేమకర్యే నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయినే నమః
ఓం మహావిషఘ్న్యై నమః
ఓం విషదాయై నమః
ఓం మహాదుర్గవినాశిన్యై నమః
ఓం మహావర్షాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహాసుభ్రద్రాయై నమః
ఓం మహ్యై సుభగాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాసత్యే నమః
ఓం మహాప్రత్యంగిదేవతాయై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాప్రళయకారిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం మహ్యై మంగళకారిణ్యై నమః
ఓం మహారమ్యై నమః
ఓం మహారాజ్యై నమః
ఓం మహా రాగిణ్యై నమః
ఓం మహా రాజరాజ సింహాసిన్యై నమః
ఇతి శ్రీ మహిషాసురమర్దని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం