December 24, 2025

తమిళనాడు కరూర్ లో విజయ్ సభలో తొక్కిసలాట. 39 మంది మృతి. చాలామంది చికిత్స

0
IMG-20250928-WA1648

సెప్టెంబర్ 28 చెన్నై:తమిళనాడులో నటుడు, టీవీకే అధినేత విజయ్ రాజకీయ సభ పెను విషాదాన్ని మిగిల్చింది. కరూర్ నగరంలో ఆయన నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉండటం అందరినీ కలచివేస్తోంది. మరో 46 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

శనివారం జరిగిన ఈ సభకు కార్యకర్తలు, అభిమానులు ఊహించని రీతిలో భారీ సంఖ్యలో తరలివచ్చారు. విజయ్ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో జనాన్ని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. విపరీతమైన జనం, తీవ్రమైన ఉక్కపోత కారణంగా చాలామంది ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితిని గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేశారు. కొందరికి స్వయంగా మంచినీటి బాటిళ్లు అందించే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ, కొద్దిసేపట్లోనే పరిస్థితి పూర్తిగా చేయిదాటి పెను తొక్కిసలాటకు దారితీసింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు, అంబులెన్సులు జనసందోహం మధ్య నుంచి అతికష్టం మీద క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హుటాహుటిన కరూర్ చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ… “ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కాదు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడమే మా ప్రథమ కర్తవ్యం. ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. విజయ్‌ను అరెస్ట్ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed