BLY హోమ్స్ ఓల్డ్ హఫీజ్ పేట్ వద్ద ఘనంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్
సెప్టెంబర్ 27: శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్,BLY హోమ్స్ వద్ద బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయ సంస్కృతి ప్రతీక బతుకమ్మ సంబరాలను కుటుంబ సభ్యులతో కలసి ఘానంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సంబరాల్లో ముఖ్య అతిథిగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ యొక్క చక్కటి కార్యక్రమాని ఏర్పాటు చేసిన అనూష మహేష్ యాదవ్ గారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి. ఆడబిడ్డలంతా ఓచోట చేరి ఆట పాటలతో, కోలాటాలతో తొమ్మిది రోజుల పాటు ఆనందంగా జరుపుకొనే తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ అని ఆయన అన్నారు.ఆడబిడ్డల ఆరాధనగా నిలిచిన బతుకమ్మ పండుగ ప్రతి ఇంటికి ఆనందం, సుభిక్షం, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అన్ని అన్నారు.అలాగే రాష్ట్రంలోని మహిళలందరూ ఆర్థికంగా బలపడుతూ, సామాజికంగా శక్తివంతులుగా ఎదగాలని నా హృదయపూర్వక అభిలషా అన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖలు,నాయకులు, కుటుంబ బంధుమిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.