December 24, 2025

శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి.3.వరోజు అమ్మవారి అలంకారము శ్రీ అన్నపూర్ణా దేవి

0
FB_IMG_1758598900801

సెప్టెంబర్ 24 హైదరాబాద్:విజయవాడ దుర్గమ్మ అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు 🙏అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. #ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. #అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. #భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. ” హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. #అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి.#శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రము!🙏

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 ||

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ

ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ

చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 ||

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ

కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||

దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ

లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ

వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 ||

ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ

కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 ||

దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ

వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||

చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ

చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ

సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||

అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |

ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ || 11 ||

మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |

బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||

సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |

శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమో‌உస్తు తే || 13 ||

రచన: ఆది శంకరాచార్య –

🙏సర్వేజన సుఖినోభావంత్ 🙏

🙏🏼🙏🏼🙏🏼🙏🏼

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed