వన్ కాలనీ – వన్ స్టాండ్
కూకట్ పల్లి సెప్టెంబర్ 22:సమాజ హితం కోసం, మా వంతు బాధ్యత గా ప్రస్తుతం జరుగుతున్న హాస్టల్ వ్యవహారలపై అందరూ ఐకమత్యం గా తీసుకున్న నిర్ణయాలను మీరు మీ పత్రికలు ద్వారా ప్రజల్లోకి సందేశం పంపగలరు. వన్ కాలనీ వన్ స్టాండ్ అనే నినాదంతో జాన్ మోజెస్,సయ్యద్ రావెల్షా అధ్యక్షతన సమావేశం నిర్వహించబడింది. పార్టీలకు అతీతంగా నివాసితులు వృద్ధులు లను ఒకే వేదికపై తీసుకువచ్చి వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. కెపిహెచ్బి వెల్ఫేర్ అసోసియేషన్ తోపాటు కెపిహెచ్బి కాలనీ నందు అన్నిపీసుల యూత్ అసోసియేషన్ లో ఏకధాటిపై తీసుకువచ్చి వారి సూచనలను పరిగణలో తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. కాలనిలో గల 600 హాస్టల్ నందు నివాసముంటున్న వివిధ రకాల విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు పలు కారణాలు కారంగా వచ్చి నివాసం ఉంటున్న వారి వల్ల కెపిహెచ్బి కాలనీ నందు స్థానికంగా నివాసం ఉంటున్న కుటుంబ నివసితుల ఇబ్బందులను దృష్టిలో సమస్యలు పరిష్కారించాలని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో వృద్ధులు, 40 ఏళ్ల నుండి నివసం ఉంటున్న వారి వద్ద నుండి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగ తెలునుకున్నాము కాలానిలో ఉన్న అన్ని అన్ని ఫేస్ ల నివసితులను సినియర్ సిటిజన్ అసోసియెషన్ వాళ్ళలో కలిని ३३ సమస్యలను పరిష్కారించుకోని హస్టల్ యజమాన్య కలిసి చర్చించుకొని అనుకున్న విధంగా సామరస్యంగా విజయవంతం చెయ్యాల అని నిర్ణయించుకున్నాము వన్ కాలనీ వన్ స్టాండ్ అనే నినాదంతో ఈ యొక్క పోరాటాన్ని మొదలుపెట్టారు. రానున్న రోజులో ఇంక సమస్యలు పరిష్కారించకపోత అధికరుల దృష్టిక తీసుకెళ్తాము అని బలంగా నిర్ణయించుకున్నారు. కాలనీ వాసుల నుండి వృద్ధుల నుండి యూత్ సభ్యుల నుండి తెలుసుకున్న ప్రధాన సమస్యలు : 1.పార్కింగ్ సమస్యలు నివారించడానికి ప్రతి భవనము నందు గ్రౌండ్ ఫ్లోర్ లోనే పార్కింగ్ కేటాయించే విధానంగా భవనాన్ని తీర్చిదిద్దుకోవడం. 2. స్వీయ సెక్యూరిటీ నేర్పరచుకోవడంతోపాటు ఎమర్జెన్సీ సర్వీసు కు సిద్ధంగా ఉండాలి. 3. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధించాలి. 4. ఆడపిల్లలు మగ పిల్లలు దగ్గరగా కూర్చోవడం అసభ్యంగా ప్రవర్తించడం బహిరంగ ప్రదేశాల్లో కూర్చొని ఇతర నివాసులు ఇంటి ముందు కూర్చొని ఎక్కువ సమయం గడిపి అసభ్యంగా ప్రవర్తించే విధానానికి స్వస్తి పలకాలి. 5. పూర్తి హాస్టల్ వాతావరణం పెరగడంతో స్థానికంగా నివాసం ఉండి ఓటర్ల సైతం ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు ఇలా వెళ్లిపోవడం వల్ల ఏ పార్టీ ఉన్నప్పటికీ అభివృద్ధిలో భాగస్వామ్యం కాదనేది కూడా గుర్తుంచుకోవాలి అందువల్ల నివాస్తులు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది. 6. ఈడబ్ల్యూఎస్ ఉన్న ప్రదేశాలలో హాస్టల్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా చూసుకోవాలి. 7. ప్రతి గల్లీలో స్ట్రీట్ లైట్స్ వెంటనే ఏర్పాటు చేయాలి. 8. సర్వీస్ రోడ్ లో ఉన్న షాపుల వల్ల రోడ్లు ఆక్రమించడంతోపాటు వాహనాలు రాకపోకలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి తోపుడుబండ్లు కూడా అక్కడే ఉండడం వల్ల రోడ్డు ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ విషయాన్ని ట్రాఫిక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాము. 9. ఇతర రాష్ట్రాల పార్టీల ర్యాలీలు మరియు పుట్టినరోజు వేడుకలు సినిమా హీరోల వేడుకలు సౌండ్స్ పెడుతూ స్థానిక నివాసులను ఇబ్బందులు పెట్టే అంశం గురించి పూర్తి చర్యలు తీసుకొని నివారించాల్సిన అవసరం ఉందని సూచించడం జరిగింది. ఇది మొదటి సమావేశం కావున ప్రస్తుతానికి ప్రధాన అంశాలు మాత్రమే చర్చించడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని అంశాలు ప్రజల సంక్షేమం దృష్ట్యా స్థానిక కాలనీ సమస్యలను అందరి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం రెండో సమావేశం నిర్ణయించాలని సమావేశంలో తీర్మానించడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో వెంకట్ గౌడ్, అట్లూరి దీపక్, మగ్దుం భాయ్, దిల్షాద్, ముబీన్ భాయ్, దినేష్ నాయుడు, సాయినాథ్ రెడ్డి, తులసి రెడ్డి, విహెచ్పి తేజ, మహేష్ ధనలక్ష్మి, వాసు వర్మ, అమర్నాథ్ నాయుడు, బాలు చౌదరి, ప్రమోద్ పవర్, గోవర్ధన్, మోజస్ మహేష్, పవన్ రెడ్డి, కేబుల్ ప్రసాద్, చందు చౌదరి, టంపు, కోటిపల్లి బాబి, ఆదినారాయణ, శ్రీను, వంశీ, దినేష్, తదితరులు పాల్గొన్నారు.