మహారాజా శ్రీ అగ్రసేన్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు
సెప్టెంబర్ 22 హైదరాబాద్: మహారాజా శ్రీ అగ్రసేన్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మహారాజా శ్రీ అగ్రసేన్ గారి జయంతిని పురస్కరించుకుని అఖిల భారత వైశ్య ఫెడరేషన్, తెలంగాణ అగర్వాల్ సమాజ్ సంయుక్తంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అగ్రసేన్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, నగర మేయర్ విజయలక్ష్మి గద్వాల గారు ఇతర ప్రజాప్రతినిధులు, అఖిల భారత వైశ్య సమాఖ్య అధ్యక్షుడు గిరీష్ సంఘి గారితో పాటు ఇతర ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ అగ్రసేన్ మహరాజ్ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.