మెదక్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలను ఇంచార్జి మంత్రివర్యులు డా. వివేక్ వెంకటస్వామి గారు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారితో కలిసి పరిశీలించారు
ఆగస్టు 28 మెదక్:మెదక్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలను ఇంచార్జి మంత్రివర్యులు డా. వివేక్ వెంకటస్వామి గారు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారితో కలిసి పరిశీలించారు.
సర్దన గ్రామ ప్రజలను ముందస్తుగా పోచారం డ్యామ్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులను మంత్రి అభినందించారు.
వెంకటేశ్వర గార్డెన్లో 500 మందికి, జికేఆర్ గార్డెన్లో 300 మందికి పునరావాసం కల్పించబడింది. మంత్రి గారు స్వయంగా పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రజల పరిస్థితులను తెలుసుకుని అవసరమైన సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం హవేలీ ఘనపూర్ మండలంలో వరదలతో తెగిపోయిన రహదారిని పరిశీలించి, వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అదే విధంగా నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించిన మంత్రి గారు, పంట నష్టాలకు ప్రభుత్వం తక్షణ సాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సాయం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.