December 24, 2025

హనుమంతుని జన్మరహస్యాలు (భక్తి సాగరం)

0
IMG-20250812-WA0375

ఆగస్టు 12:హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వివరించడానికి శివమహాపురాణం, రామాయణం, పరాశిర సంహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది. శివమహాపురాణంలోని కథ :పూర్వం శివుడు రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో తన వీర్యాన్ని స్ఖలనం చేశాడు. సప్తమహర్షులు దానిని సాదరంగా ఒకచోట పొందుపరిచారు. కొన్నాళ్ల తరువాత ఆ శివుని వీర్యాన్ని.. గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెడతారు. ఫలితంగా మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వానరదేహంతో హనుమంతుడు జన్మించాడని శివపురాణంలో తెలపబడింది.
ఆ విధంగా హరుని అంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడిగా, శివసుతుడిగా శివపురాణంలో వర్ణించబడింది. త్రిపురా సంహారంలో విష్ణువు, పరమశివుడికి సహకరించినందువల్ల ఆయన కృతజ్ఞుడై.. హనుమంతుడిగా అవతరించాడు. అలాగే రావణుడిని సంహరించడానికి శ్రీరాముడికి సహకరించాడని ఈ పురాణంలో పేర్కొనబడింది.గ్రంథంలోని కథ :పూర్వం ఒకనాడు రాక్షసులను సంహరించడం కోసం విష్ణువు, పరమశివునికి ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచనమేరకు శివుడు త్రిమూర్తుల తేజస్సును మింగుతాడు. ఆ తేజస్సు కారణంగా పార్వతీదేవి, శివుని వీర్యాన్ని భరించలేక.. అగ్నిదేవునికి ఇస్తుంది. అగ్నిదేవుడు కూడా ఆ వీర్యాన్ని భరించలేక వాయుదేవునికి అప్పగిస్తాడు. అప్పుడు వాయుదేవుడు ఆ వీర్యాన్ని ఒక మండురూపంలో మలిచి.. పుత్రిడికోసం ప్రార్థిస్తున్న అంజనాదేవికి ఇస్తాడు.అంజనాదేవి ఆ పండును తినడంతో గర్భం దాల్చి, కాలక్రమంలో ఆంజనేయునిని జన్మనిచ్చింది. వాయుదేవుడిచ్చి ప్రసాదంతో ఆంజనేయుడు జన్మించడంతో వాయునందనుడు అనే పేరు కలిగిందని ఈ సంహితంలో వివరించబడి వుంది. భగవంతుని అనుగ్రమం వల్లే పుట్టాడు కనుక.. ఆమెకు కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి పేర్కొన్నట్టు ఈ గ్రంథంలో సూచించబడింది�

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed