2025 ఆగస్టు 4 నాటికి నాగార్జునసాగర్ మానవ నిర్మిత మహా కట్టడం జాతికి అంకితం చేసి 58 ఏళ్లు పూర్తి చేసుకుంది
Oplus_0
ఆగస్టు 4 హైదరాబాద్: 2025 ఆగస్టు 4 నాటికి నాగార్జునసాగర్ మానవ నిర్మిత మహా కట్టడం జాతికి అంకితం చేసి 58 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1967 ఆగస్టు 4న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ స్వయంగా నాగార్జునసాగర్ విచ్చేసి కుడి జవహర్ ,ఎడమ లాల్ బహద్దూర్ కాలువలకు నీటిని విడుదల చే సారు. మహోన్నత కట్టడాన్ని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
1955 డిసెంబర్ 10వ తేదీన తొలి భారత ప్రధానమంత్రి జోహార్ లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆధునిక సౌభాగ్య మందిరంగా , ప్రాజెక్టు ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు.
శంకుస్థాపన నాటినుండి నిర్విరామంగా 45 వేల మంది కూలీలు 400 మంది ఇంజనీర్లు 5000 మంది వరకు వర్క్ చర్జెడ్ సిబ్బంది విరామమెరుగక తమ స్వేదబిందువు లతో ప్రాజెక్టు ను అంకితభావంతో నిర్మించారు. కేవలం పూర్తిగా మానవ శ్రమ తో 12సంవత్సరాల కాలంలో 127 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు పూర్తయింది.
తొలి చీఫ్ ఇంజనీర్ మీర్ జాఫర్ అలీ. ఏపీ రంగనాథస్వామి లాంటి ఎంతోమంది అనుభవజ్ఞులు నిపుణులు ఇంజనీర్లు సాంకేతిక నిపుణులు మేధావులు జల నిపుణులు ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు.
నిర్మాణం సందర్భంగా దేశ దేశాలకు చెందిన ప్రముఖులందరో ప్రాజెక్టు ను సందర్శించి అబ్బుర
పడ్డారు. ప్రాజెక్ట్ రూపకల్పన నిర్మాణం సాంకేతిక సలహా పూర్తిగా భారతీయ ఇంజనీర్ల దే. ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది డాక్టర్ కానూరు లక్ష్మణ రావు. వీరు కే ఎల్ రావు గా సుపరిచితులు. శ్రీశైలం నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు రూపకల్పన చేసింది కూడా డాక్టర్ కే ఎల్ రావు గారే.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ 10 నాటికి 70 ఏళ్లు నిండుతాయి.
ప్రాజెక్టు నిర్మాణంలో తొలిగా ప్రాణాలు కోల్పోయిన శ్రామికురాలు గురువమ్మ. ఎందరో కూలీలు workcharjed సిబ్బంది .ఇంజనీర్లు తమ ప్రాణాలను నిర్మాణ సమయంలో కోల్పోయారు .వారందరినీ ఈ సందర్భంగా స్మరించుకుందాం.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ బహుళార్థసాధక ప్రాజెక్టు. ప్రధానంగా వ్యవసాయ ప్రాజెక్టు. తదుపరి 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన గావిస్తుంది. హైదరాబాద్ కు తాగు నీటిని అందిస్తుంది .22 లక్షల ఎకరాలకు తన జలాలచేత బంగారు పంటలు పండిస్తుంది. అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని పెద్ద ప్రాజెక్టులు నాగార్జునసాగర్ ఒకటి.ఈజిప్ట్ పిరమిడ్ ముడంతలు పెద్దది. పది కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినజలాశయం తో 408 శతకోటి ఘనపుటడుగుల రిజర్వాయర్ సామర్థ్యం కలిగినది.
ప్రాజెక్టుకు 55 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ సమాచారాన్ని నేటి తరాలకు ఉపయోగపడుతుందని అందిస్తున్నాను .
మీ కె.వి వాయిస్..
సీనియర్ జర్నలిస్ట్ ప్రాజెక్టుల అధ్యయన వేత్త