నేటి నుండి దక్షిణాయణం ప్రారంభం.(జూలై 17 నుండి)
Oplus_0
జూలై 17 హైదరాబాద్:దక్షిణాయణం అంటే సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ‘ఉత్తరాయాణం’ అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ‘దక్షిణాయణం’ అని అంటారు.మన పూర్వికులు సూర్య భగవానుని గమనం ప్రకారం యుగాలు గానూ, యుగాలను సంవత్సరములు గానూ, సంవత్సరములను మాసములు గానూ, మాసములను వారములు గానూ, వారములను రోజులు గానూ, రోజులను జాములు గానూ, జాములను ఘడియలు గానూ కాల గమనాన్ని తెలుసుకోవటానికి విభజించారు.సంవత్సరంలో ఉన్న 12 మాసములను రెండు ఆయనాలుగా విభజించారు. సనాతన ధర్మంలో అంటే మతం కాదు. ఇది ఒక శాస్త్రీయమైన జీవినవిధానం. దీనిలో మన పూర్వీకులు అనేకానేక శాస్త్రీయ అంశాలను జోడించి నిత్యనూతనంగా మనకు అందించారు. భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి కాలగణo అద్భుతంగా చేశారు.
‘అయనం’ అంటే ప్రయాణం అని అర్ధం. భూమి తనచుట్టూ తాను రోజుకు ఒకసారి తిరుగుతుంది. అందువలన పగలు, రాత్రి ఏర్పడుతున్నాయి. ఒక పగలు, ఒక రాత్రి ఇవి పూర్తీ కావడానికి 24 గంటల సమయం పడుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుంచి జనవరి14 వరకు దక్షిణాయణం అని అంటారు. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు.
భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయణం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ప్రారంభమవుతుంది.సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు.
మానవ కార్యకలాపాలపై ఆధారపడిన ఈ సమయం నుండి ప్రకృతిలో సమూల మార్పులు పుష్కలంగా ప్రారంభమవుతాయి.
ఈ దక్షిణాయణంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయణం దేవతలకు రాత్రి కాలం.
ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో ఉపాసనలు, యజ్ఞాలు, జపాలు, అభిషేకాలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయినది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.
శాస్త్రీయంగా దక్షిణాయణంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
దక్షిణాయనం నుంచి పగలు తక్కువ సమయం, రాత్రి వేల ఎక్కువ సమయం ఉంటుంది.