మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు, ఎంపీ రేణుకా చౌదరి పై నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుకొట్టివేసిన కోర్టు
జూలై 11ఖమ్మం: 2014 సంవత్సరంలో భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాననీ మోసం చేశారని ఆరోపిస్తూ.. ప్రవేట్ కంప్లైంట్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆ కేసు పై ఖమ్మం జిల్లా కోర్టులోని ఎస్సీ ,ఎస్టీ న్యాయస్థానం సాక్షులను విచారించి నేరం రుజువు కాకపోవడంతో శుక్రవారం కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రేణుక చౌదరి తరఫున సీనియర్ న్యాయవాదులు ఎం. నిరంజన్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు… జిల్లా కోర్టు వద్దనుండి భారీ ర్యాలీతో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం చేరుకున్న రేణుక చౌదరి… ఘనంగా స్వాగతం పలికిన ఆమె అనుచర గణం.