December 24, 2025

కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్

0
IMG-20250703-WA0021

ప్రెస్ నోట్*

జులై 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ గారి అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు ముఖ్యంగా పాల్గొన్నారు.

ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ఏకమవాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ఇది పెద్ద దిక్సూచి అవుతుందని మంత్రివర్యులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed