అశ్వరావుపేట అందంగా ఉండాలి ఎమ్మెల్యే జారే,అధికారులతో కలిసి మంత్రి తుమ్మల సమీక్ష.
జూలై 3:అశ్వారావుపేట నియోజవర్గం అందం గా ఉండాలని,సమస్యలు ఉంటే ఎమ్మెల్యే ఆదినారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాలని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.గురువారం గండుగులపల్లి లోని తన స్వగృహంలో అధికారులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో కలిసి సమీక్ష నిర్వహించారు.సమీక్ష లో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, చెరువులు,ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న అశ్వారావుపేట ను తెలంగాణ గుమ్మంగా తీర్చి దిద్దాలని తుమ్మల కోరారు. అశ్వారావుపేట,దమ్మపేట తహసీల్దార్లు,విధ్యుత్, ఇరిగేషన్,ఆర్ అండ్ బి,అటవీ, పంచాయతీ రాజ్,పోలీస్ శాఖ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆయిల్ ఫెడ్ రాష్ట్ర అధ్యక్షులుఆలపాటి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుత రావు,కాసాని నాగ ప్రసాద్,కె వి సత్యనారాయణ, మన్యం అప్పారావు,ఎర్ర వసంతరావు,మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వర రావు ఉన్నారు.