తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య : ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మన ఊరి న్యూస్ ప్రతినిధి మహబూబ్ నగర్ జూలై 3: తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. మహబూబ్ నగర్ నగర పాలక పరిధిలోని ఎదిర కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య స్పూర్తితో గ్రామాల్లో ప్రజలు వెట్టిచాకిరి రద్దు కోసం ఉద్యమబాట పట్టారని, పన్నులు కట్టేదే లేదని తిరుగుబాటు చేశారని ఆయన గుర్తు చేశారు. దొడ్డి కొమురయ్య ఆత్మ బలిదానం వలన దేశవ్యాప్తంగా భూ సమస్యలపై చర్చ జరిగింది అని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తు లో మన పిల్లలు కుల వృత్తితో పాటు ఏదైనా నైపుణ్య శిక్షణ పొందాలని ఆయన చెప్పారు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాల లో మన పిల్లలు ఎక్కువ మంది చేరి ఏదైనా ఒక నైపుణ్య శిక్షణ పొందాలని ఆయన సూచించారు. మన గ్రామంలో ఉన్న పిల్లలు మంచి చదువులు చదవి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, రాజకీయాల పేరుతో గ్రామాలను విచ్చిన్నం చేయరాదని హితవు పలికారు. గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ఉమ్మడిగా గ్రామానికి ఏమేమి కావాలి అని రోడ్ మ్యాప్ వేసుకుని తన వద్దకు రావాలని అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్త దానం శిబిరం ప్రారంభించారు. అనంతరం 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కురుమ సంఘం భవన నిర్మాణానికి ఆయప భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, క్యామ మల్లేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హన్మంతు, శివశంకర్, శాంతన్న యాదవ్, నాయకులు శ్రీశైలం, జేసిఆర్, కోస్గి శివప్రసాద్ రెడ్డి, చర్ల శ్రీనివాసులు, రాములు బచ్చన్న, కర్నె కృష్ణయ్య, గ్యాస్ అంజి, నర్సింహులు, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.