December 24, 2025

మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్.. భారీగా తగ్గే రెట్లు

0
IMG-20250703-WA0008

*మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్.. భారీగా తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!*మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రభుత్వానికి ఆదాయం పెరగటానికి తోడ్పడింది.అయితే ప్రస్తుతం మధ్యతరగతి భారతీయులకు అనుగుణంగా పన్ను రేట్లలో తగ్గింపును అందించబోతున్నట్లు వెల్లడైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అనేక వస్తువుల ధరలను అధిక జీఎస్టీ బ్రాకెట్ నుంచి తక్కువ పన్నులకు మార్చాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వెల్లడైంది.ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయపు పన్ను విషయంలో పన్ను రహిత ఆదాయ పరిమితిని న్యూ టాక్స్ రీజిమ్ కింద రూ.12 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్లో చేసిన ప్రకటన మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఆదాయం కలిగిన ప్రజల కోసం జీఎస్టీ పన్నుల విషయంలో కూడా పెద్ద మార్పులకు కేంద్రం శ్రీకారం చుడుతోందని సమాచారం. దీనికింద 12 శాతం కింద ఉన్న అనేక వస్తువులపై పన్నును 5 శాతానికి తగ్గించనున్నట్లు వెల్లడైంది.*కేంద్రం తెస్తున్న జీఎస్టీ పన్ను మార్పులతో తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..*• టూత్ పేస్ట్• టూత్ పౌడర్• గొడుగులు• కుట్టు మిషన్లు• ప్రెషర్ కుక్కర్లు• వంట సామాగ్రి• ఎలక్ట్రిక్ గీజర్లు• ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు• చిన్న వాషింగ్ మెషిన్లు• సైకిళ్లు• రెడీమేడ్ దుస్తులు• ఫుట్ వేర్• స్టేషనరీ వస్తువులు• వ్యాక్సిన్స్• సిరామిక్ టైల్స్• వ్యవసాయ ఉపకరణాలురేట్లను తగ్గించటం ద్వారా అమ్మకాలు పెరుగుతాయని ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు పెరిగి దీర్ఘకాలంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనికి అనుగుణంగానే జీఎస్టీ రేట్లలో కీలక మార్పులు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు. దేశంలోని మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ భారం తగ్గింపుతో రిలీఫ్ ఇచ్చేందుకు తాము తీవ్రంగా కృష్టి చేస్తున్నట్లు ఆమె వెళ్లడించారు. అయితే ఈ నిర్ణయాలకు రాష్ట్రాల మధ్య కొంత సమన్వయం లోబడటం ఆలస్యాలకు కారణంగా మారుతోందని వెల్లడైంది. రాష్ట్రాలు తమ ఓటింగ్ ద్వారా సమ్మతిని తెలిపితే జీఎస్టీ రేట్ల మార్పులు సులభతరం అవుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం పంజాబ్, కేరళ, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంచి రాష్ట్రాలు ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed