తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామిని గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు.
జూలై 2:తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని వారి నివాసంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజల సంక్షేమం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు పేర్కొన్నారు. రాజకీయ, సాంఘిక సేవలలో వివేక్ వెంకటస్వామి గారు కలిగిన అనుభవం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు..
మంత్రి గారు కూడా ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ శక్తివంచన లేకుండా పనిచేస్తుందని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు నాయకత్వంలో ఐక్యత అవసరమని, అందులో ఝాన్సీ రెడ్డి గారి పాత్ర ప్రాముఖ్యతను ఆయన కొనియాడారు..