పాశమైలారం పేలుడు ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డా”వివేక్ వెంకటస్వామి
జూలై 1:పాశమైలారం ప్రాంతంలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆయన వెంట కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, రైతు సంక్షేమ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు,డా. వివేక్ వెంకటస్వామి గారు** మాట్లాడుతూ:
“ఈ సంఘటన ఎంతో బాధాకరం. కార్మికుల ప్రాణ భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా అన్ని చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
మంత్రి గారు అధికారులు మరియు పరిశ్రమ యాజమాన్యంతో సమావేశమై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలవాలని మంత్రివర్యులు స్పష్టంగా హామీ ఇచ్చారు.
– మంత్రి కార్యాలయం
డా. జి. వివేక్ వెంకటస్వామి
మంత్రి – కార్మిక, ఉపాధి కల్పన మరియు గనుల శాఖ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం