ఉట్నూర్ సీఐ ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
జూన్ 30 ఉట్నూర్: నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మడావి ప్రసాద్ ను పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.సోమవారం సర్కిల్ కార్యాలయానికి వెళ్లి సీఐ మడావి ప్రసాద్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని, అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీఐ తెలిపారు. ప్రజలు, నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాదవ్ సంతోష్, గైక్వాడ్ భరత్, విజయ్,భాస్కర్,జగన్ తదితరులు ఉన్నారు.