రవాణా శాఖ మంత్రిని కలిసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
జూన్ 30:తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, BC సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని సోమవారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు ప్రత్యేకంగా కలిశారు.వనపర్తి జిల్లా కేంద్రంలో రవాణా శాఖ (RTO) నూతన కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లడంతో అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన వనపర్తి మండలం అప్పాయపల్లి గ్రామ శివారులో రూ 9.50 కోట్లతో జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని నిర్మించేందుకు త్వరలోనే జీవో జారీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారని ఎమ్మెల్యే తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు